శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 03:05:10

6+23=29 ఎన్నెన్నో మధుర స్మృతులు

6+23=29  ఎన్నెన్నో మధుర స్మృతులు
  • పెండ్ల్లి రోజున ప్రియాంక భావోద్వేగ పోస్టు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం తన పెండ్ల్లి రోజు సందర్భంగా సోషల్‌మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.  వివిధ సందర్బాల్లో దిగిన ఫొటోలను  షేర్‌ చేస్తూ ఓ సందేశాన్ని రాశారు. ‘లక్షలాది అందమైన జ్ఞాపకాలు.. ప్రేమ, కన్నీళ్లు, నవ్వులు, కోపం, స్నేహం, కుటుంబం, భగవంతుడు ఇచ్చిన రెండు బహుమతులు (ఇద్దరు పిల్లలు), నాలుగు అందమైన పెంపుడు శునకాలు.. నా నుంచి విడదీయరాని మధురస్మృతుల కలబోతే ఈ జీవితం.. 6+23 సంవత్సరాలు.. 29 ఏండ్లు.. నేటికి’ అని ట్వీట్‌ చేశారు. పెండ్లి ఫొటోలతో పాటు తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌, భర్త వాద్రా, పిల్లలు రైహాన్‌, మిరాయతో దిగిన ఫొటోలనూ ఆమె పోస్టుచేశారు. రాబర్ట్‌ వాద్రాతో 1997 ఫిబ్రవరి 18న ఆమె పెండ్లి జరిగింది. వారి పైండ్లె 23 ఏండ్లు కాగా.. అంతకముందు ఆరేండ్లపాటు వారు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక ‘6+23.. 29 ఏండ్ల’ అని రాసినట్టు తెలుస్తున్నది. 


logo