గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 18:25:51

కేరళలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదు

కేరళలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదు

తిరువనంతపురం : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాలతో పాటు కేరళలో కూడా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అక్కడ 593 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,659కి చేరింది.  అందులో 6,416 మంది చికిత్స పొందుతుండగా మిగతా కేసులు కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 39 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. అదే విధంగా తిరువనంతపురంలో గడిచిన 24 గంటల్లో 173 కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo