శనివారం 30 మే 2020
National - May 23, 2020 , 14:47:46

కొత్తగా 591 కరోనా కేసులు

కొత్తగా 591 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ప్రతి రోజు అక్కడ ఐదు వందలకు పైనే పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడాన్ని చూస్తే ఈ ప్రాణాంతక వైరస్‌ ఎంతలా విస్తరించిందో అర్థంచేసుకోవచ్చు. ఢిల్లీలో గత 24 గంటల్లో 591 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 12,910కి చేరాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో 6412 యాక్టివ్‌గా ఉండగా, 6267 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 218 మంది మరణించారు. 

దేశంలో 1,25,101 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 6654 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.


logo