మంగళవారం 14 జూలై 2020
National - Jun 26, 2020 , 21:42:07

గుజరాత్‌లో కొత్తగా 580 కరోనా కేసులు

గుజరాత్‌లో కొత్తగా 580 కరోనా కేసులు

గాంధీనగర్‌ : గుజరాత్‌ రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో కొత్తగా 580 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 30,158కి చేరింది. వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 18మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,038మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జీ కాగా 1,772మంది మృతి చెందినట్లు పేర్కొంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ముఖ్యమంత్రి విజయ్‌రూపానితో సమావేశమయ్యారు.  అహ్మదాబాద్‌లో సివిల్‌ హాస్పిటల్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. డిప్యూటీ సీఎం నితిన్‌పటేల్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసుల సంఖ్య నేటికి 4,90,401కి చేరింది. ఒకేఒక్కరోజు అత్యధికంగా 17,296 కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.


logo