శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 19:18:18

తమిళనాడులో ఒకేరోజు 580 మందికి కరోనా

తమిళనాడులో ఒకేరోజు 580 మందికి కరోనా

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీ ఎత్తున పెరుగుతున్నది. గురువారం కొత్తగా 580 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,409కి చేరింది. గురువారం కొత్తగా మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 37కు పెరిగింది. మొత్తం 5,409 మంది కరోనా బాధితుల్లో 1,547 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 37 మంది మృతిచెందారు. మిగతా 3,822 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


logo