సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 14:39:42

నాగాలాండ్‌లో కొత్తగా 57 కరోనా కేసులు

నాగాలాండ్‌లో కొత్తగా 57 కరోనా కేసులు

కోహిమా :  నాగాలాండ్‌లో గడిచిన 24 గంటల్లో 57 కరోనా కేసులు నమోదు అయ్యాయని బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేశారు. మొత్తం 513 నమూనాలు స్వీకరించి పరీక్షలు చేయగా 57 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా 23 కేసులు కోహిమాకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిమాపూర్‌లో నమోదయ్యాయి. 

బుధవారం తాజాగా భారతదేశంలో 37,724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులం సంఖ్య 11,92,915కు చేరింది. ఇప్పటివరకు 28,732 మంది మరణించారు. 4,11,133మంది ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతుండగా.. 7,53,049 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. భారత్‌లో రికవరీ శాతం 62.72గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలియజేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo