శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 19:41:50

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 4343 కేసులు

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి.. కొత్త‌గా 4343 కేసులు

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతి త‌గ్గ‌డం లేదు. ఆ రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధిక‌మైపోతున్నాయి. గురువారం ఒక్క‌రోజే త‌మిళ‌నాడులో కొత్త‌గా 4343 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 57 మంది ప్రాణాలు కోల్పోయారు. త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,392కు చేరింది. మృతుల సంఖ్య 1,321కి చేరిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.


logo