శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 19:39:38

గుజ‌రాత్‌లో 563 కేసులు.. 21 మ‌ర‌ణాలు

గుజ‌రాత్‌లో 563 కేసులు.. 21 మ‌ర‌ణాలు

అహ్మదాబాద్‌: గుజ‌రాత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. మొద‌ట్లో కొత్త కేసుల న‌మోదు ప‌దుల సంఖ్య‌లో ఇప్పుడు వంద‌ల్లో న‌మోద‌వుతున్నాయి. ఆదివారం సాయంత్రం సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 563 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో గుజ‌రాత్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,880కి చేరింది. 

ఇక క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా గుజ‌రాత్‌లో క్ర‌మంగా పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 21 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 1685కు చేరింది. గుజ‌రాత్‌లో న‌మోదైన మొత్తం కేసుల‌లో 19,917 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి కాగా, మిగ‌తా వారు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.   


logo