గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 12:45:18

ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

 ఏపీలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కృష్ణా, కర్నూల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో కరోనా మరణాల సంఖ్య 38. కరోనా రహిత జిల్లాగా ఉన్న విజయనగరంలో తాజాగా మూడు పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,833కు చేరింది. ఈ వైరస్‌ నుంచి 780 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

గడిచిన 24 గంటల్లో అనంతపూర్‌ జిల్లాలోలో 3, గుంటూరులో 10, కడపలో 6, కృష్ణాలో 16, కర్నూల్‌లో 7, నెల్లూరులో 4, విశాఖపట్టణంలో 7, విజయనగరం జిల్లాలో 3 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. 


logo