సోమవారం 01 జూన్ 2020
National - May 10, 2020 , 19:14:11

మ‌రో 56 మంది ఐటీబీపీ సిబ్బందికి క‌రోనా

మ‌రో 56 మంది ఐటీబీపీ సిబ్బందికి క‌రోనా

న్యూఢిల్లీ: ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందిలో క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 56 మందికి కొత్త‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఐటీబీపీ సిబ్బందిలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 156కు చేరింది. కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డ 56 మంది ఢిల్లీలో విధులు నిర్వ‌హిస్తున్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఐటీబీపీ ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 62,939 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వారిలో 19,358 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగ‌తా బాధితులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


logo