శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 14:04:21

557 మంది పోలీసులకు కరోనా

557 మంది పోలీసులకు కరోనా

ముంబై: దేశంలో కరోనా మహమ్మారికి ప్రధానకేంద్రంగా మారింది మహారాష్ట్ర. అత్యధిక కరోనా కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో కొనసాగుతున్నది. కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు అదే వైరస్‌ బారిన పడుతున్నారు. ఇలా మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 557 మంది కరోనా బాధితులుగా మారారని రాష్ట్ర హోం మంత్రి అనిల దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. 

రాష్ట్రంలో కొత్తగా 1362 కరోనా కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. ఇప్పటివరకు 694 మంది మరణించారు.


logo