గురువారం 04 జూన్ 2020
National - May 15, 2020 , 13:57:45

రాజస్థాన్‌లో కొత్తగా 55 కరోనా కేసులు

రాజస్థాన్‌లో కొత్తగా 55 కరోనా కేసులు

జైపూర్‌: రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం నుంచి శుక్రవారానికి కొత్త మరో 55 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,589కి చేరింది. రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం కేసులలో 2,646 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 125 మంది మృతిచెందారని వారు తెలిపారు. ప్రస్తుతం 1,818 మంది రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.logo