బుధవారం 02 డిసెంబర్ 2020
National - Apr 10, 2020 , 08:56:52

12 గంట‌లు..కొత్త‌గా 547 క‌రోనా పాజిటివ్ కేసులు

12 గంట‌లు..కొత్త‌గా 547 క‌రోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: గ‌డిచిన 12 గంట‌ల్లో కొత్త‌గా మ‌రో 547 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, 30 మర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కు చేరుకుంద‌ని పేర్కొంది.

మొత్తం కేసుల్లో 5709 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా..504 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యార‌ని, 199 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను మ‌రింత పొడిగించే అవ‌కాశాలున్న‌ట్లు ఇప్పటికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..