శుక్రవారం 03 జూలై 2020
National - Jun 20, 2020 , 16:30:08

54 శాతం కరోనా పేషెంట్లు కోలుకున్నారు: త‌మిళ‌నాడు సీఎం

54 శాతం కరోనా పేషెంట్లు కోలుకున్నారు: త‌మిళ‌నాడు సీఎం

చెన్నై: త‌మిళ‌నాడులో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల‌లో 54 శాతం మంది కోలుకున్నార‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి తెలిపారు. ప్రతిరోజు వేల‌ల్లో క‌ర‌నా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని, పాజిటివ్‌గా తేలిన వారిని వివిధ ఆస్ప‌త్రుల్లోని ఐసోలేష‌న్ కేంద్రాలకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా రోగుల కోసం 83 టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయ‌ని, అదేవిధంగా 17,500 బెడ్లు అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త రోగం కావ‌డంతో చాలామందికి ఈ వైర‌స్ తీవ్ర‌త అర్థం కావ‌డంలేద‌ని, అందుకే ఈ వ్యాధిపై ప్ర‌జ‌ల్లో అవగాహ‌న క‌ల్పించేందుకు అన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ప‌ళ‌నిస్వామి తెలిపారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా బాధితుల కోసం 300 మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేశామ‌ని, ఈ సంఖ్య‌ను 450కి పెంచ‌డం కోసం ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ రిస్క్‌ను త‌గ్గించాల‌ని సీఎం ప‌ళ‌నిస్వామి కోరారు. 


logo