సోమవారం 01 జూన్ 2020
National - May 11, 2020 , 20:42:49

పంజాబ్ లో కొత్త‌గా 54 పాజిటివ్ కేసులు..మొత్తం 1877

పంజాబ్ లో కొత్త‌గా 54 పాజిటివ్ కేసులు..మొత్తం 1877

చండీగ‌ఢ్‌: పంజాబ్ లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ‌ ఒక్క‌రోజే కొత్త‌గా 54 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1877కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 1678 యాక్టివ్ గా ఉన్నాయ‌ని పంజాబ్ వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

పంజాబ్ లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో  లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఫాలో అవుతూ..ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ‌ పాటించాల‌ని,, అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో త‌ప్ప రోడ్ల‌పైకి ఎవ‌రూ రాకూడ‌ద‌ని పోలీసులు కోరుతున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo