ఆదివారం 31 మే 2020
National - May 08, 2020 , 12:41:11

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 54 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 41 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1004 మంది కరోనా రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌-19 నుంచి కోలుకొని 842 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఒకరు చనిపోయారు. అనంతపురం(16), విశాఖ(11), పశ్చిమ గోదావరి(9), కర్నూలు(7), కృష్ణా(6), చిత్తూరు(3) జిల్లాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కొత్త కేసు నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 547 కరోనా బాధితులు ఉన్నారు. 


logo