బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 16:48:43

ఒకరికి కరోనా పాజిటివ్‌.. 54 వేల మంది హోం క్వారంటైన్‌

ఒకరికి కరోనా పాజిటివ్‌.. 54 వేల మంది హోం క్వారంటైన్‌

సూరత్‌ : దేశంలోని ప్రతి మూలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. దీంతో ఈ వైరస్‌ నిరోధానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. గుజరాత్‌ సూరత్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సూరత్‌లోని రందేర్‌ జోన్‌లో 67 ఏళ్ల వ్యక్తి లాండ్రీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో రందేర్‌ జోన్‌ను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లాండ్రీ షాపు నుంచి చుట్టుపక్కల కిలోమీటర్‌ పరిధి వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ఈ జోన్‌లో సుమారు 16,800ల నివాసాలు ఉన్నాయి. 54 వేల మంది నివాసం ఉంటున్నారు. లాండ్రీ షాపు ఓనర్‌కు కరోనా రావడంతో 54 వేల మందిని వైద్యాధికారులు, పోలీసులు హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఈ జోన్‌లో ఉన్న నివాసాలతో పాటు 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 మెయిన్‌ రోడ్లు, 82 ఇంటర్నల్‌ రోడ్లను మున్సిపల్‌ సిబ్బంది శానిటైజ్‌ చేసింది. మొత్తం 55 బృందాలు కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ శానిటైజేషన్‌ చేశారు. 


logo