గురువారం 04 జూన్ 2020
National - May 18, 2020 , 20:39:38

ఒక్కరోజే 536 మందికి కరోనా

ఒక్కరోజే 536 మందికి కరోనా

చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత ఉధృతంగా పెరుగుతున్నది. ప్రతిరోజు వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కూడా ఒక్కరోజే కొత్తగా 536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11,760కి చేరింది. సోమవారం మరో ముగ్గరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 81కి చేరింది. 4,406 మంది వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగతా 7,270 మంది వివిధ ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 39 ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో 22 ప్రైవేటు ల్యాబ్‌లు, 17 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉన్నాయని చెప్పారు.


logo