బుధవారం 08 జూలై 2020
National - Jun 21, 2020 , 14:13:46

క‌రోనాతో 53 ఏళ్ల డాక్ట‌ర్ మృతి

క‌రోనాతో 53 ఏళ్ల డాక్ట‌ర్ మృతి

ముంబై : క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌లో వైద్యులు ముందు వ‌రుస‌లో ఉండి పోరాటం చేస్తున్నారు. క‌రోనా సోకిన వారి ప్రాణాల‌ను కాపాడ‌ట‌మే ధ్యేయంగా సేవ‌లందిస్తున్నారు. అక్క‌డ‌క్క‌డ ఈ వైర‌స్ బారిన ప‌డి డాక్ట‌ర్లు కూడా మృతి చెందుతున్నారు. 

ముంబైకి స‌మీపంలోని క‌ల్యాణ్‌లో ఓ 53 ఏళ్ల డాక్ట‌ర్ క‌రోనా రోగుల‌కు వైద్యం అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ వైద్యుడికి క‌రోనా సోకింది. ఎంతో జాగ్ర‌త్త‌గా వైద్యం చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ను క‌రోనా వ‌ద‌ల్లేదు. గ‌త ప‌దిహేను రోజుల నుంచి తీవ్ర జ్వ‌రంతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. ఐదు రోజుల పాటు హోం క్వారంటైన్ లో డాక్ట‌ర్ ఉన్నారు. ఆ త‌ర్వాత 15 రోజుల నుంచి ముంబైలోని జ‌స్ లోక్ హాస్పిట‌ల్ లో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నాడు. మొత్తానికి డాక్ట‌ర్ చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు. డాక్ట‌ర్ పెద్ద కుమార్తెకు కూడా క‌రోనా సోకింది. హోళీ క్రాస్ కొవిడ్ ఆస్ప‌త్రిలో ఆమె చికిత్స పొంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. డాక్ట‌ర్ కు భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. 


logo