శుక్రవారం 03 జూలై 2020
National - Jun 30, 2020 , 10:39:11

24 గంటల్లో మరో 53 మంది జవాన్లకు కరోనా పాజిటివ్

24 గంటల్లో  మరో  53  మంది  జవాన్లకు కరోనా  పాజిటివ్

న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారితో భారత జవాన్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్  వంటి భద్రతా దళాల్లోని అనేక మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. గడచిన 24 గంటల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కు  చెందిన మరో 53 మందికి కరోనా వైరస్ సోకిందని బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా మరో నలుగురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 354 మంది జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 659 మంది భద్రతా సిబ్బంది కోలుకున్నారని  బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. 


logo