శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 12:27:13

మహారాష్ట్రలో 5205 మంది పోలీసుల‌కు క‌రోనా

మహారాష్ట్రలో  5205  మంది పోలీసుల‌కు క‌రోనా

ముంబై:  కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకీ కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య పెరిగిపోతున్నది.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 30 మంది పోలీసు  సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరో నలుగురు మృతిచెందారు. 

మహారాష్ట్రలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య  5205కు చేరింది. ఇప్పటి వరకూ 4071 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం 1070 మంది  వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.   కరోనా వల్ల ఇప్పటి వరకు 60 మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2లక్షలు దాటింది 


logo