గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 01:43:54

52 ఏండ్ల తర్వాత మళ్లీ..

52 ఏండ్ల తర్వాత మళ్లీ..
  • సింధియాల రాజీనామాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు ఎసరు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో సింధియా కుటుంబం కాంగ్రెస్‌ నుంచి వైదొలిగి నప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు ముప్పు ఏర్పడుతున్నది. యాభై రెండేండ్ల తర్వాత చరిత్ర పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్వాలియర్‌ సంస్థానానికి చెందిన ‘రాజమాత’ విజయరాజె సింధియా దేశ తొలి ప్రధాని నెహ్రూకు సన్నిహితురాలు. ఆమె కాంగ్రెస్‌ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే 1967లో ఆమె కాంగ్రెస్‌ నుంచి వైదొలగడంతో నాటి డీపీ మిశ్రా సర్కారు పడిపోయింది. లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినప్పుడు రెండుగంటలపాటు వేచి చూడాల్సి రావడం విజయరాజె ఆగ్రహానికి కారణమైంది. దీంతో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గోవింద్‌ నారాయణ్‌ సింగ్‌కు మద్దతివ్వడంతో ఆయన సీఎం అయ్యారు. ప్రస్తుతం రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. నాటి చరిత్రే పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. 


logo