సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 10:20:09

దేశంలో 19 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 19 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా ఉధృతి ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌న్పించ‌డంలేదు. ప్ర‌తిరోజు 50 వేల‌కు త‌గ్గ‌కుండా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 19 ల‌క్ష‌ల మార్కును దాటాయి. 

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 52,509 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,08,255కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 5,86,244 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. క‌రోనా బారిన‌ప‌డిన‌వారిలో 12,82,216 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 857 మంది క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మృతులు 39,795కు పెరిగారు. 

రోజువారీ పాజిటివ్ కేసుల్లో భార‌త్ మూడో స్థానంలో నిలిచింది. మొద‌టి స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో గ‌త 24 గంట‌ల్లో 56,411 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 54 వేల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తో అమెరికా రెండో స్థానంలో ఉన్న‌ది. రోజువారి మృతుల్లో కూడా భార‌త్ మూడో స్థానంలో కొన‌సాగుతున్న‌ది. అమెరికా, బ్రెజిల్ దేశాలు మొద‌టి రెండు స్థానాల్లో ఉన్నాయి.


logo