ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 16:55:16

52.47శాతం మంది కోలుకుంటున్నారు.!

52.47శాతం మంది కోలుకుంటున్నారు.!

న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడిన కోలుకుంటున్న వారి శాతం 52.47శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి బారినపడిన వారిలో సగం మందిపైగా కోలుకుంటున్నారని పేర్కొంది. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం కరోనాతో కోలుకుంటున్న వారి శాతం 51.08గా ఉంది. 24గంటల వ్యవధిలో సుమారు 10,215మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా త్వరలో 1,08,012మంది రోగులు కోలుకునే అవకాశముందని ఆ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 1,53,178 యాక్టివ్‌ కేసులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించింది. logo