శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Sep 24, 2020 , 14:39:47

గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ వాయిదా

గోవా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ వాయిదా

ప‌నాజీ: ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన 51వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాను (ఇఫి) గోవా ప్ర‌భుత్వం వాయిదావేసింది. న‌వంబ‌ర్ 20 నుంచి 28 వ‌ర‌కు జ‌ర‌గాల్సిన ఇఫీ ఉత్స‌వాల క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఉత్స‌వాల‌ను వ‌చ్చేడాది జ‌న‌వ‌రి 16 నుంచి 24 వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది.

 దీనికి సంబంధించి కేంద్ర స‌మాచార, ప్ర‌సార వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌తో గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ చ‌ర్చించారు. అనంత‌రం ఉత్స‌వాల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌చ్చే జ‌న‌వ‌రిలో ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఇండియాకు గోవా శాస్వ‌త వేదిక‌గా ఉన్న విష‌యం తెలిసిందే.