శుక్రవారం 03 జూలై 2020
National - May 30, 2020 , 22:01:45

బెంగాల్‌లో 5,130 కేసులు.. 237 మ‌ర‌ణాలు

బెంగాల్‌లో 5,130 కేసులు.. 237 మ‌ర‌ణాలు

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రింత విస్త‌రిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శ‌నివారం సాయంత్రానికి కొత్త‌గా 317 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,130కి చేరింది. శ‌నివారం ఎలాంటి మ‌ర‌ణాలు చోటుచేసుకోలేదు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 237కు చేరింది. ప‌శ్చిమబెంగాల్ ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇక దేశంలో కూడా ఇవాళ‌ కొత్త‌గా 7,964 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఒకేరోజు 265 మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని కేంద్ర వైద్య‌ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.   


logo