సోమవారం 13 జూలై 2020
National - Jun 27, 2020 , 11:36:20

ఢిల్లీలో సిరోలాజిక‌ల్ స‌ర్వే.. 50వేల యాంటిజెన్ కిట్స్ ఇచ్చిన ఐసీఎంఆర్‌

ఢిల్లీలో సిరోలాజిక‌ల్ స‌ర్వే.. 50వేల యాంటిజెన్ కిట్స్ ఇచ్చిన ఐసీఎంఆర్‌

హైద‌రాబాద్: ఢిల్లీలో భారీ స్థాయి క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌డుతున్నారు.  దేశ రాజ‌ధానిలో వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో..  ఐసీఎంఆర్ స‌హ‌కారంతో రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు సిరోలాజిక‌ల్ సర్వే చేప‌డుతున్నాయి.  జూన్ 27వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వ‌ర‌కు ఈ స‌ర్వే జ‌ర‌గ‌నున్న‌ది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) సంస్థ కూడా ఢిల్లీ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తున్న‌ది. 

ఢిల్లీలో యాంటిజెన్ ఆధారిత ర్యాపిడ్ టెస్ట్ ప‌రీక్ష‌ల‌ను చేపట్ట‌నున్న‌ట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. దీని కోసం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి 50వేల యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఐసీఎంఆర్ పేర్కొన్న‌ది. ఉచితంగా ఈ కిట్ల‌ను ఢిల్లీ ప్ర‌భుత్వానికి అందజేసినట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది.  కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఢిల్లీ సిరోలాజిక‌ల్ ప‌రీక్ష‌ల‌కు త‌మ వంత స‌హ‌కారం అందించింది.  దీని కోసం 1.57 లక్ష‌ల ఆర్ఎన్ఏ కిట్ల‌ను అంద‌జేసింది. వీటితో పాటు 2.84 ల‌క్ష‌ల వైర‌ల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం(వీటీఎం)ల‌ను అంద‌జేసింది. స్వాబ్ శ్యాంపిళ్ల సేక‌ర‌ణ కోసం వీటిని వినియోగిస్తారు. 

ఢిల్లీలో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల కోసం డ‌యాగ్న‌స్టిక్ మెటీరియ‌ల్‌ను కూడా ఐసీఎంఆర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ఢిల్లీలో మొత్తం 12 ల్యాబ్‌లు ఇప్ప‌టి వ‌ర‌కు 4.7 ల‌క్ష‌ల ఆర్‌టీ పీసీఆర్ ప‌రీక్ష‌లు చేప‌ట్టాయి. ఆ ల్యాబ్‌ల‌కు డ‌యాగ్న‌స్టిక్ మెటీరియ‌ల్‌ను తామే స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఐసీఎంఆర్ చెప్పింది.logo