బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 02:28:51

5000 కొత్త కేసులు

5000  కొత్త కేసులు

  • దేశంలో 1800 దాటిన కరోనా మరణాలు 

న్యూఢిల్లీ, మే 7: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు 56 వేలు దాటాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రినాటికి ఐదువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 89 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,811కు చేరుకున్నది. పీటీఐ వార్తా సంస్థ గురువారం రాత్రి 11.30 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 56,391 కేసులు నమోదయ్యాయి. 1,811 మంది మరణించారు. దాదాపు 16 వేలమంది కోలుకున్నారు. కాగా గత 24 గంటల్లో దేశంలోని 13 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. కేరళ, జమ్ముకశ్మీర్‌, ఒడిశా తదితర రాష్ర్టాలు ఈ జాబితాలో ఉన్నాయి.


logo