శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 15:03:24

స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మా దానం చేయండి : సీపీ సజ్జనార్

స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మా దానం చేయండి : సీపీ సజ్జనార్

హైదరాబాద్‌ : కరోనా నుంచి కోలుకున్న వారు దానం చేసే 500 మి. లీ ప్లాస్మాతో మరో ఇద్దరు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని సైబారాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారు ఇతరుల కోసం స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మా దానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ర్టవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా బారిన పడి కోలుకున్న బాధితులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో వేల మంది కరోనబారిన పడుతున్నారని వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్‌ రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. ఇప్పటికే ఎంతో మంది పోలీసులు కరోనా బారిన పడి కోలుకుని ప్లాస్మా ఇవ్వడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. అలా ముగ్గురిని కాపాడి వారి కుటుంబాలను ఆదుకున్నామన్నారు. ప్లాస్మా దానం చేసినప్పటికీ 24 గంటలు నుంచి 72 గంటల్లో శరీరంలోకి ప్లాస్మా వచ్చి చేరుతుందని సజ్జనార్ తెలిపారు. ప్లాస్మా ఇవ్వాలనుకునే వారు ఎవరైనా ఫోన్ ద్వారా 9490617440కి సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.



logo