గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 20:59:56

మాస్కులు ధరించని 500 మందిపై ఎఫ్‌ఐఆర్‌

మాస్కులు ధరించని 500 మందిపై ఎఫ్‌ఐఆర్‌

లూథియానా : పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానాలో మే 18నుంచి నేటివరకు మాస్కులు ధరించకుండా, సామాజికదూరం నిబంధన ఉల్లఘించిన  500మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, 11వేల మందికి చలానా విధించామని లూథియానా పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, పోలీసులు ప్రజల బాగుకోసమే పని చేస్తున్నారని అన్నారు. వారాంతాల్లో అంతర్‌ జిల్లాల ప్రయాణానికి పాసులు జారీ చేసి అనుమతి ఇస్తున్నామని, మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  చాలా మంది మాస్కులు పెట్టుకోకపోవడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. కానీ కొందరు మాత్రం పోలీసులకు అడ్డు చెబుతున్నారు. తాము ఇతరులతో మాట్లాడేందుకు మాస్కు అడ్డు తగులుతోందని అసౌకర్యం కారణంగా మాస్కు పెట్టుకోవడం లేదని అంటున్నారు. logo