బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 03:23:30

తినడం తగ్గించేస్తున్నారు!

తినడం తగ్గించేస్తున్నారు!

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రజలపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దాదాపు 50 శాతం మంది ప్రజలు తక్కువగా తింటున్నారు. రానున్న రోజుల్లో తిండి గింజలకు కొరత ఏర్పుడుతుందోనన్న భయంతో ఈవిధంగా చేస్తున్నారు. బీహార్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర 12 రాష్ర్టాల్లోని 47 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఐదు వేల మంది కుటుంబాలపై పలు సివిల్‌ సొసైటీ సంస్థలు ఈ సర్వే నిర్వహించాయి. గతంతో పోలిస్తే ఆహారంలో పలు పదార్థాలను తీసుకోవడం మానేసినట్టు దాదాపు 68 శాతం మంది పేర్కొన్నారు. మూడు పూటల భోజనం విధానాన్ని మార్చుకొన్నట్టు యాభై శాతం మంది వెల్లడించారు.  


logo