శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 14, 2020 , 09:53:24

పంజాబ్‌లో పెళ్లి వేడుకలకు 50 కాదు 30 మందే..

పంజాబ్‌లో పెళ్లి వేడుకలకు 50 కాదు 30 మందే..

చండీగఢ్ : పంజాబ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్క‌డి రాష్ట్ర  ప్రభుత్వం బహిరంగ సభల‌ను పూర్తిగా నిషేధించింది. అలాగే సామూహిక కార్య‌క్ర‌మాల‌కు ఐదుగురు, పెళ్లిళ్ల‌కు 30 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తినిచ్చింది. గతంలో వివాహ వేడుకలకు 50 మంది వ‌ర‌కు అనుమ‌తి ఉండేది. ఇప్పుడు దీనిని మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌నున్నారు.

పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న‌దాని ప్ర‌కారం ఎవ‌రైనాస‌రే సామాజిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించే ముందు పోలీసులు, ప‌రిపాల‌నా అధికారుల‌ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం నిబంధనలు విధించింది. అలాగే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిరిగేట‌ప్పుడు ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాలని, భౌతిక దూరం పాటించాల‌ని, లేదా జరమానా విధిస్తామని  అధికారులు హెచ్చరిస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo