e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News థ‌ర్డ్‌ వేవ్ ఏర్పాట్లు : 3 నెలల్లో 50 మాడ్యులర్ ద‌వాఖాన‌లు

థ‌ర్డ్‌ వేవ్ ఏర్పాట్లు : 3 నెలల్లో 50 మాడ్యులర్ ద‌వాఖాన‌లు

థ‌ర్డ్‌ వేవ్ ఏర్పాట్లు : 3 నెలల్లో 50 మాడ్యులర్ ద‌వాఖాన‌లు

న్యూఢిల్లీ : కరోనా థ‌ర్డ్ వేవ్‌తో పోరాడేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను వెంటనే బలోపేతం చేయడానికి ఒక ప్రణాళికను కేంద్రం రూపొందించింది. రానున్న‌ 3 నెలల్లో దేశవ్యాప్తంగా 50 మాడ్యులర్ ద‌వాఖాన‌ల‌ను నిర్మించాలని కేంద్రం యోచిస్తున్న‌ది. ఈ ద‌వాఖాన‌ల్లో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లు జ‌రుగుతాయి.

సెకండ్‌ వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరా అతిపెద్ద సమస్యగా త‌యారైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ మాడ్యులర్ ద‌వాఖాన‌లు ప్రస్తుతం ఉన్న హాస్పిట‌ళ్ల‌కు దగ్గర్లో నిర్మించేందుకు యోచిస్తున్నారు. త‌ద్వారా ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తర‌ణ చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ఒక్కో ద‌వాఖానను రూ.3 కోట్ల‌తో 3 వారాల‌లోపు నిర్మించ‌వ‌చ్చు. వీటిలో ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్, ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ మాడ్యులర్ ద‌వాఖాన‌ల జీవితకాలం కనీసం 25 సంవత్సరాలు. విపత్తు సమయాల్లో వీటిని అవ‌స‌రానికి అనుగుణంగా మార్చుకోవ‌చ్చు.

మాడ్యులర్ హాస్పిటల్ ప్రత్యేకతలు..

- Advertisement -

100 పడకలు ఏర్పాటు

ఐసీయూ కోసం ప్రత్యేక జోన్

విద్యుత్తు, ఆక్సిజన్, నీటి సదుపాయం క‌ల్పించ‌డం

దాదాపు రూ.3 కోట్ల ఖర్చు

3 వారాల్లో పనులు పూర్తిచేయ‌డం

ఈ ప్రాజెక్టును ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ్ రాఘవన్ ప్రారంభించిన‌ట్లుగా తెలుస్తున్న‌ది. ప్ర‌భుత్వ‌ ఆసుపత్రుల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరతను తీర్చడం ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యచికిత్స‌లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవ‌డం కోసం ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు. ఇటువంటి ద‌వాఖాన‌లు అవసరమయ్యే రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయానికి చెందిన అదితి లేలే చెప్పారు. ముఖ్యంగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో, ఈ ప్రాజెక్టులో సహ‌కారం అందించే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇతర భాగస్వాములను కూడా సంప్రదించిన‌ట్టు లేలే తెలిపారు.

తొలుత ఈ ప్రాంతాల్లో..

ఈ ప్రాజెక్ట్ కింద మొద‌టి బ్యాచ్ మాడ్యుల‌ర్ ద‌వాఖాన‌ల‌ను ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, మహారాష్ట్రలోని పుణె, జాల్నా, పంజాబ్‌లోని మొహాలిలో నిర్మించనున్నారు. ఇవే కాకుండా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇలాంటి 20 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. మొదటి దశలో కర్ణాటకలోని బెంగళూరులో 20, 50, 100 పడకల ద‌వాఖాన‌లు తయారు చేయనున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ప్లాట్‌ఫాం టికెట్ రేటు పెంచారు : 150 కోట్ల ఆదాయం కోల్పోయారు

రాష్ట్ర హోదాను పున‌రుద్ధ‌రించాలి : నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్

గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!

ప్రోటీన్ వ‌న‌రు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్త‌మం

బ‌హు భార్య‌త్వానికి మ‌ద్ద‌తు.. లా ప్రొఫెస‌ర్‌కు ఇక్క‌ట్లు

ఆంక్ష‌ల పొడ‌గింపు : బ్రిట‌న్‌ను భ‌య‌పెడుతున్న డెల్టా వేరియంట్‌

గెలుపు కోసం : యూపీలో త్వ‌ర‌లో క్యాబినెట్ విస్తరణ..?

ఏడాది ఆల‌స్యం : అక్టోబ‌ర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్‌పో 2020

చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
థ‌ర్డ్‌ వేవ్ ఏర్పాట్లు : 3 నెలల్లో 50 మాడ్యులర్ ద‌వాఖాన‌లు
థ‌ర్డ్‌ వేవ్ ఏర్పాట్లు : 3 నెలల్లో 50 మాడ్యులర్ ద‌వాఖాన‌లు
థ‌ర్డ్‌ వేవ్ ఏర్పాట్లు : 3 నెలల్లో 50 మాడ్యులర్ ద‌వాఖాన‌లు

ట్రెండింగ్‌

Advertisement