బుధవారం 03 జూన్ 2020
National - May 20, 2020 , 09:37:18

50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌

50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ వలస కూలీలంతా గత వారం మహారాష్ట్ర నుంచి సొంత జిల్లా అయిన బస్తీకి చేరుకున్నారు. కూలీలందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. కరోనా బాధితులందరినీ ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ 50 మందితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొత్తంగా బస్తీ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 104కు చేరుకుంది. ఈ వైరస్‌ నుంచి 28 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo