శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 18:33:44

50 ల‌క్ష‌ల మంది వీధివ్యాపారుల‌కు 5వేల కోట్లు..

50 ల‌క్ష‌ల మంది వీధివ్యాపారుల‌కు 5వేల కోట్లు..


హైద‌రాబాద్‌: కోవిడ్‌19 వ‌ల్ల వీధి వ్యాపారులు దారుణంగా దెబ్బ‌తిన్నారు.  వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఓ కొత్త ప‌థ‌కాన్ని ర‌చించింది. నెల రోజుల్లోగా ఆ స్కీమ్‌ను ప్ర‌భుత్వం ప్రారంభించ‌నున్న‌ది.  దేశవ్యాప్తంగా సుమారు 50 ల‌క్ష‌ల మంది వీధివ్యాపారుల‌కు 5వేల కోట్ల రుణం ఇవ్వ‌నున్న‌ది.  ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ మీడియా స‌మావేశంలో తెలిపారు. మూల‌ధ‌నం పెట్టుబ‌డిగా క‌నీసం ప‌దివేల రూపాయ‌లు ఇవ్వ‌నున్న‌ది. వీధి వ్యాపారుల్లో డిజిట‌ల్ పేమెంట్స్‌ను ప్రోత్స‌హించ‌నున్నారు. రిపేమెంట్ స‌రిగా ఉన్న వారికి రివార్డులు ఇవ్వ‌నున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దానిలో భాగంగా ఇవాళ మంత్రి సీతారామ‌న్ వీధివ్యాపారుల స్కీమ్‌ను వెల్ల‌డించారు. 


logo