మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 09:58:35

దేశంలో కొత్త‌గా 50 వేల క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 50 వేల క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. గ‌త ప‌ది రోజులుగా 40 వేలపైచిల‌కు న‌మోద‌వుతుండ‌గా, ఇవాళ 50 వేలు దాటాయి. ఇది నిన్న‌టికంటే 5.3 శాతం పెరిగాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 50,356 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 84,62,081కి చేరింది. ఇందులో 78,19,887 మంది బాధితులు కోలుకోగా, మ‌రో 5,16,632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కొత్త‌గా 53,920 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. కాగా, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల‌ కొత్త‌గా 577 మంది మ‌ర‌ణించార‌ని, దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 1,25,562 మంది బాధితులు మృతిచెందార‌ని వెల్ల‌డించింది. రిక‌వ‌రీ రేటు 92.41 శాతం, మ‌ర‌ణాల రేటు 1.48 శాతంగా ఉంద‌ని పేర్కొంది. 

దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 11,65,42,304 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీ వైద్య ప‌రిశోధాన మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒక్క‌రోజే 11,13,209 మందికి క‌రోనా ప‌రీక్షలు చేశామ‌ని చెప్పారు.