గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 15:01:44

కోవిడ్‌ ఆస్పత్రులకు 50 వేల వెంటిలేటర్ల పంపిణీ

కోవిడ్‌ ఆస్పత్రులకు 50 వేల వెంటిలేటర్ల పంపిణీ

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న కోవిడ్‌ ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం నేడు 50 వేల వెంటిలేటర్స్‌ను పంపిణీ చేసింది. మేడ్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా 50 వేల వెంటిలేటర్ల తయారీకి పీఎం కేర్స్‌ ఫండ్‌ కింద కేంద్రం రూ. 2 వేల కోట్లను కేటాయించింది. 50 వేల వెంటిలేటర్లలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ 30 వేల వెంటిలేటర్లు తయారు చేసింది. మిగతా 20 వేల వెంటిలేటర్లలో ఏజీవీఏ హెల్త్‌కేర్‌ 10 వేల వెంటలేటర్లు, ఏఎంటీజడ్‌ బేసిక్‌ 5,650 వెంటిలేటర్లు, ఏఎంటీజడ్‌ హై ఎండ్‌ 4 వేల వెంటిలేటర్లు, వీటి అనుబంధ తయారీ సంస్థ మరో 350 వెంటిలేటర్లను తయారు చేసింది. 1340 వెంటిలేటర్లను వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటికే సరఫరా చేసింది. మహారాష్ట్రకు 275, ఢిల్లీ-275, గుజరాత్‌-175, బిహార్‌-100, కర్ణాటక-90, రాజస్థాన్‌కు 75 వెంటిలేటర్లను అందించింది. ఈ నెల చివరి వరకు మరో 14 వేల వెంటిలేటర్లను ఇతర రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేయనుంది. 

వలస కార్మికుల సంక్షేమానికి రూ. 1000 కోట్లు

వలస కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం మరో రూ. వెయ్యి కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను వలస కార్మికులకు వసతి కల్పన, ఆహారం అందించడం, వైద్య చికిత్స చేయించడం, రవాణాకు ఉపయోగించనుంది. ఇందులో మహారాష్ట్రకు రూ.181 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.103 కోట్లు, తమిళనాడుకు రూ.83 కోట్లు, గుజరాత్‌కు 66 కోట్లు, ఢిల్లీకి రూ. 55 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ.53 కోట్లు, బిహార్‌కు రూ.51 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 50 కోట్లు, రాజస్థాన్‌కు రూ.50 కోట్లు, కర్ణాటకకు రూ. 34 కోట్లు కేటాయించింది. 


logo