గురువారం 26 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 02:52:52

బుడ్డోడి సెల్యూట్‌కి.. ఐటీబీపీ గౌరవం

బుడ్డోడి సెల్యూట్‌కి.. ఐటీబీపీ గౌరవం

న్యూఢిల్లీ: నెల కిందట ఐటీబీపీ జవాన్లకు ‘కడక్‌' సెల్యూట్‌ చేస్తూ నెటిజన్లను ఫిదా చేసిన ఐదేండ్ల బుడతడు నవాంగ్‌ నంగ్యాల్‌ మరోసారి నెట్టింట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లఢక్‌లోని చుషుల్‌కు చెందిన ఆ చిన్నారికి ఐటీబీపీ తన యూనిఫాం అందించి గౌరవించింది. యూనిఫాం ధరించి నంగ్యాల్‌ కవాతు చేస్తున్న వీడియోను ఐటీబీపీ ట్విట్టర్‌లో పోస్ట్‌చేసింది. క్యూట్‌ సోల్జర్‌, ఫ్యూచర్‌ సోల్జర్‌, మేకింగ్‌ ఆఫ్‌ వారియర్‌ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. గత నెల 8న ఆ చిన్నారి ఐటీబీపీ జవాన్లకు సెల్యూట్‌ చేయడాన్ని ఓ జవాన్‌ వీడియో తీసి ట్వీట్‌ చేయగా వైరల్‌గా మారింది.