బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 18:28:35

సీఎం టిక్ టాక్.. చిన్నారితో సందేశాత్మక వీడియో

సీఎం టిక్ టాక్.. చిన్నారితో సందేశాత్మక వీడియో

క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డానికి అధికారులు కొత్త మార్గాల‌ను క‌నుగొంటున్నారు. ప్ర‌జ‌లు దేనికైతే అల‌వాటు ప‌డ్డారో ఆ దారిలోనే వ‌చ్చారు పంజాబ్‌కు చెందిన ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌. టిక్‌టాక్ ద్వారా సామాజిక దూరం గురించి అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇప్పుడీ వీడియో వైర‌ల్ అయింది.

ఈ టిక్‌టాక్‌లో ముఖ్య‌మంత్రితోపాటు మోగాకు చెందిన ఐదేండ్ల నూర్‌ప్రీత్ కౌర్ అనే అమ్మాయి కూడా ఉంది. ఇందులో పాప సిక్కు అబ్బాయిగా అద‌ర‌గొట్టింది. కొంత‌మంది గ్రామ‌స్తులు క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యంలో క్రికెట్ ఆడేందుకు బ‌య‌లుదేరారు. వారిని చూసిన సిక్కు అబ్బాయి అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఎంత‌కీ వాళ్లు విన‌క‌పోయేస‌రికి ముఖ్య‌మంత్రికే వీడియో కాల్ చేస్తాడు బాబు. గ్రామ‌స్తుల‌ విన్న‌పాన్ని డైరెక్టుగా సీఎమ్‌కే చెప్పుకోమ‌ని వీడియోకాల్‌లో బాగా ఇరికిస్తాడు. ఇక సీఎం ఊరుకుంటారా.. బాగా చివాట్లు పెడుతారు'.. ఈ వీడియోలో చిన్నారి చాలాబాగా న‌టిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. 


logo