గురువారం 04 జూన్ 2020
National - Apr 01, 2020 , 16:16:26

మర్కజ్‌ ప్రార్థనలు.. ఆ ఐదు రైళ్లల్లో ప్రయాణించిన ప్రచారకులు

మర్కజ్‌ ప్రార్థనలు.. ఆ ఐదు రైళ్లల్లో ప్రయాణించిన ప్రచారకులు

హైదరాబాద్‌ : ఢిల్లీలోని మర్కజ్‌ భవన్‌లో జరిగిన ప్రార్థనల్లో దేశం నలుమూలల నుంచి మత ప్రచారకులు పాల్గొన్నారు. అత్యధికంగా దక్షిణాది రాష్ర్టాల నుంచి ఆ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందనే సమయంలోనే మర్కజ్‌ ఉదంతం బయటపడే సరికి దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఢిల్లీలోని మర్కజ్‌ భవన్‌లో ప్రార్థనలు ముగిసిన అనంతరం దక్షిణాది రాష్ర్టాలకు ఐదు రైళ్లల్లో మత ప్రచారకులు ప్రయాణించినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. మార్చి 13 నుంచి 19వ తేదీ మధ్యలో ఈ ప్రయాణాలు జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గుంటూరుకు దురంతో ఎక్స్‌ప్రెస్‌, చెన్నైకు గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నైకు తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ - రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌, ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరాయి. అయితే ఈ రైళ్లల్లో 1000 నుంచి 1200 మంది చొప్పున ప్రయాణించిన వారిలో అత్యధికంగా మత ప్రార్థనలకు హాజరైన వారే ఉన్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మార్చి 13న మత ప్రార్థనల్లో పాల్గొని ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కరీంనగర్‌కు 10 మంది ఇండోనేషియన్లు వచ్చిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ - రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోనూ 60 మంది దాకా ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


logo