గురువారం 04 జూన్ 2020
National - May 13, 2020 , 10:37:28

గ‌ల్ఫ్ నుంచి 5 విమానాల్లో 900 మంది త‌ర‌లింపు..

గ‌ల్ఫ్ నుంచి 5 విమానాల్లో 900 మంది త‌ర‌లింపు..


హైద‌రాబాద్‌: గ‌ల్ఫ్ దేశాల నుంచి వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా ఇవాళ అయిదు విమానాల్లో 900 మంది భార‌తీయుల‌ను త‌ర‌లించ‌నున్నారు. దుబాయ్ నుంచి వ‌స్తున్న రెండు విమానాల్లో.. ఒక‌టి ఢిల్లీకి, మ‌రొక‌టి అమృత్‌స‌ర్‌కు వెళ్ల‌నున్న‌ది. ఢిల్లీ విమానంలో 241 మంది ప్రయాణికులు, అమృత్‌స‌ర్ విమానంలో 178 మంది భార‌తీయులు ఉండ‌నున్నారు. ఇక కువైట్ నుంచి రెండు ఫ్ల‌యిట్లు బ‌య‌లుదేర‌నున్నాయి. దాంట్లో ఒక‌టి అహ్మ‌దాబాద్‌కు, మ‌రొక‌టి కోజికోడ్‌కు వెళ్ల‌నున్న‌ది. ఈ రెండు విమానాల్లో మొత్తం 330 మంది ప్ర‌యాణికులు ఉంటారు.  జెద్దా నుంచి కాలిక‌ట్ వ‌స్తున్న విమానంలో 149 మంది ప్ర‌యాణికులు ఉంటారు. తీవ్ర నిరాశ‌లో ఉన్న కార్మికుల‌కు, వృద్ధులు, మెడిక‌ల్ కేసులు ఉన్న‌వారు, గ‌ర్భిణులు.. తొలుత విమానంలో ఎక్కేందుకు ప్రాధాన్య‌త ఇచ్చారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు లేనివారిని మాత్ర‌మే విమానం ప్ర‌యాణానికి అనుమ‌తి ఇస్తున్నారు.logo