ఆదివారం 07 జూన్ 2020
National - Apr 08, 2020 , 08:11:26

క‌ర‌గ ఫెస్టివ‌ల్ కు ఐదుగురికి మాత్ర‌మే అనుమ‌తి: క‌ర్ణాట‌క సీఎం

క‌ర‌గ ఫెస్టివ‌ల్ కు ఐదుగురికి మాత్ర‌మే అనుమ‌తి:  క‌ర్ణాట‌క సీఎం

బెంగళూరు: రాష్ట్ర ప్ర‌జ‌లు క‌ర‌గ ఫెస్టివ‌ల్ ను జ‌రుపుకునేందుక అవ‌కాశ‌మిస్తున్న‌ట్లు క‌ర్ణాట‌క సీఎం బీఎస్ యడియూర‌ప్ప తెలిపారు. క‌ర‌గ ఫెస్టివ‌ల్ విష‌య‌మై య‌డియూర‌ప్ప ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...బెంగ‌ళూరులోని ధ‌ర్మ‌రాయ‌ణ స్వామి టెంపుల్ లో నిర్వ‌హించే క‌ర‌గ ఫెస్టివ‌ల్ వేడుక‌లు నిర్వ‌హించేందుకు కేవ‌లం 4-5 మందికి మాత్ర‌మే పాల్గొనేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు చెప్పారు. క‌ర‌గ ఫెస్టివ‌ల్ వేడుక‌లు ఇవాళ సాయంత్రం ప్రారంభం కానున్నాయి. క‌ర్ణాట‌క‌లో ప్ర‌జ‌లు 

క‌ర్ణాట‌క వాసులు ఏటా మార్చి నుంచి మే మ‌ధ్య కాలంలో.. ధ‌ర్మ‌రాయ స్వామి, ద్రౌప‌త‌మ్మ‌ల‌ను కొలుస్తూ తావి, నాదస్వ‌రం, ముని, ఉడుక్క‌, పంబ వంటి సంగీత వాయిద్యాలు వాయిస్తూ జాన‌ప‌ద నృత్యం చేస్తూ ఈ వేడుక‌లు నిర్వ‌హిస్తారు. క‌రోనా ను నియంత్రించేందుకు లాక్ డౌన్ కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో..ప్ర‌జ‌ల విజ్ఞ‌ప్తికి మేర‌కు  క‌ర‌గ ఫెస్టివ‌ల్ కు అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo