సోమవారం 25 జనవరి 2021
National - Dec 22, 2020 , 06:35:32

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృత్యువాతపడగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన సియోని సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద జరిగింది. ఆగి ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులు, మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వారు. వీరు కారులో యూపీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నారని బుండోల్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌ పంచేశ్వర్‌ తెలిపారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని, సంఘటన జరిగిన సమయంలో కారు అతివేగంగా ప్రయాణిస్తోందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారని, వారిని హాస్పిటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తుల్లో నలుగురిని విజయ్‌ బహదూర్‌ పటేల్‌, అతని భారత సరిత, కుమారుడు అజయ్‌, మరో మహిళను రాధగా గురించామని, మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.  ప్రమాదంలో 9, 4 ఏళ్ల బాలికలు గాయపడ్డారని, వారిని హాస్పిటల్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


logo