మంగళవారం 31 మార్చి 2020
National - Feb 14, 2020 , 01:38:01

రూ.30వేల కోసం ఐదుగురి హత్య!

రూ.30వేల కోసం ఐదుగురి హత్య!
  • ‘భజనపుర’ కేసులో నిందితుడి అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని భజనపురలో ఐదుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసును పోలీసులు చేధించారు. వారి సమీప బంధువే వారిని హత్యచేసినట్లు గుర్తించారు. ఆ కుటుంబం నుంచి తీసుకున్న రూ.30,000 అప్పును తీర్చడం ఇష్టంలేకే నిందితుడు ప్రభునాథ్‌ వారిని హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ-రిక్షా డ్రైవర్‌ శంభు చౌదరి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు వారి ఇంటి తలుపు పగులగొట్టి చూడగా.. చౌదరితోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజితో నిందితుడిని గుర్తించారు. ఈనెల 3న హత్యలు చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. 

logo
>>>>>>