గురువారం 16 జూలై 2020
National - Jun 28, 2020 , 15:44:28

ఢిల్లీ జైళ్లలో ఐదుగురు ఖైదీలకు కరోనా

ఢిల్లీ జైళ్లలో ఐదుగురు ఖైదీలకు కరోనా

న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి జైలు ఖైదీలనూ కలవరపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలోని జైళ్లలో ఐదురుగు ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదివరకు 45 మంది ఖైదీలు కొవిడ్‌ బారినపడ్డారు. అలాగే, 75మంది జైలు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. 

కరోనా రోగుల కోసం అక్కడి జైలు పరిపాలన అధికారులు ఐసోలేషన్‌ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. కొత్త ఖైదీలకు స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఖైదీల వార్డులు, సిబ్బంది నివాస సముదాయాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. కాగా, కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో ఈ నెల 20 వరకు, 4,129 మంది ఖైదీలను వివిధ జైళ్ల నుంచి విడుదల చేశారు. జైళ్లలో మాస్కులు, హ్యాండ్‌వాష్, శానిటైజర్లను కూడా తయారుచేస్తున్నారు.logo