గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 14:43:54

లాలూ పార్టీకి జేడీయూ షాక్‌!

లాలూ పార్టీకి జేడీయూ షాక్‌!

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ (ఆర్జేడీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ నాయ‌కుడు, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్సీల‌ను త‌నవైపు తిప్పుకుని లాలూ పార్టీకి గ‌ట్టి షాకిచ్చారు. ఆర్జేడీకి చెందిన‌ ఐదుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేసి జేడీయూలో చేరారు. ఆర్జేడీకి రాజీనామా చేసిన వారిలో సంజయ్ ప్రసాద్, కమరె ఆలమ్, రాధాచరణ్ సేఠ్, రణ్ విజయ్ సింగ్, దిలీప్ రాయ్ ఉన్నారు. 

కాగా, రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలు లాలూ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితులు కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఆర్జేడీ ఉపాధ్య‌క్షుడు ర‌ఘువంశ్‌ప్ర‌సాద్ కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయ‌న అక్క‌డి త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. ఆయ‌న కూడా జేడీయూలో చేరతార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 


logo