గురువారం 02 జూలై 2020
National - May 26, 2020 , 10:29:41

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

రాంచీ : జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధన్‌బాద్‌ జిల్లా గోవింద్‌పుర్‌ బర్వాలో ఖుడియా నది బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, మహిళ సహా ఐదుగురు మృతి చెందారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

స్థానికుల సహాయంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కారు జార్ఖండ్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.


logo