బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 08:44:20

450 ప్ర‌త్యేక‌ రైళ్ల‌తో 5,00,000 మందిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చాం: ‌రైల్వే

450 ప్ర‌త్యేక‌ రైళ్ల‌తో 5,00,000 మందిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చాం: ‌రైల్వే

న్యూఢిల్లీ: భార‌తీయ రైల్వేలు 450 ప్ర‌త్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 5,00,000 మంది వ‌ల‌స కూలీల‌ను స్వ‌రాష్ట్రాల‌కు చేర‌వేశాయ‌ని రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర్‌డీ బాజ్‌పాయ్ తెలిపారు. రోజుకు 100 శ్రామిక్ రైళ్ల‌ను న‌డుపాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న తాము, ఆ మేర‌కు ల‌క్ష్యాన్ని సాధించామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌యాణికుల్లో ప్ర‌తి ఒక్క‌రికి క‌చ్చిత‌మైన స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌నే రైళ్ల‌లోకి అనుతించామ‌ని బాజ్‌పాయ్ తెలిపారు. అంతేగాక రైళ్ల‌లో ప్ర‌యాణికులంద‌రికీ ఉచితంగా భోజనం, తాగునీటి స‌దుపాయంతోపాటు శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచుతున్నామ‌ని ఆయ‌న చెప్పారు. 


logo