సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి

ముంబై: సీరం ఇన్స్టిట్యూట్లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మహారాష్ట్ర పూణేలోని మంజ్రీ ప్లాంట్‌లో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు పూణే మేయర్ మురళిధర్ మొహల్ తెలిపారు. అనంతరం లోపల పరిశీలించగా ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. చనిపోయిన వారు భవన నిర్మాణ కార్మికులుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. మంటలు వ్యాపించినప్పుడు సంఘటనా స్థలం నుంచి నలుగురిని కాపాడినట్లు వివరించారు. అందులోని సిబ్బంది అంతా బయటకు పరుగులు తీశారని చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదని, వెల్డింగ్ పనుల వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పూణే మేయర్ మురళిధర్ వెల్లడించారు.
మరోవైపు అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.
తాజావార్తలు
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ