బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 17, 2020 , 16:15:38

ఆటోలో 5 అడుగుల కొండ‌చిలువ‌.. డ్రైవ‌ర్‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టాయి!

ఆటోలో 5 అడుగుల కొండ‌చిలువ‌.. డ్రైవ‌ర్‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టాయి!

ఈ మ‌ధ్య కొండ‌చిలువ‌లు టాయిలెట్స్‌, ఇంట్లో దృశ్య‌‌మ‌వుతున్నాయి. ఈ ప్ర‌దేశాలు కూడా బోర్ కొట్టిన‌ట్లున్నాయి. ఏకంగా ఆటోనే ఎక్కుసిందో పైథాన్‌. స‌మ‌యానికి ఆ ఆటోలో ఎవ‌రూ లేరు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే ఏ ప్ర‌మాదం వినాల్సి వ‌చ్చేదో. ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆటోలోని సిఎన్జి కిట్ కింద పాము వంక‌ర‌గా ఇరుక్కొని ఉంది. దీన్ని ప‌సిగ‌ట్టిన డ్రైవ‌ర్‌కు నోటిలో మాట‌లు రాలేదు. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. త‌ర్వాత వ‌న్య‌ప్రాణి ఎన్‌జీఓ హెల్ప్‌లైన్ నంబ‌ర్‌కు ఫోన్ చేశాడు.

హుటాహుటిన‌ ఇద్ద‌రు స‌భ్యుల రెస్క్యూ టీం అక్క‌డికి చేరుకొని కొండ‌చిలువ‌ను బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేశారు. దీన్ని బ‌య‌ట‌కు తీయ‌డానికి సిబ్బందికి గంట స‌మ‌యం ప‌ట్టింది. ఆ త‌ర్వాత పైథాన్‌ను సుర‌క్షితంగా అడ‌విలో వ‌దిలిపెట్టారు. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలో చోటు చేసుకున్న‌ది. పాముల బెడ‌ద ఎలాగున్న ప్ర‌జ‌ల‌కు పైథాన్‌ల భ‌యం  ఎక్కువైపోయింది. మ‌నుషులు తిరిగే అన్ని ప్ర‌దేశాల‌లో పైథాన్‌లు వ‌చ్చి చొర‌బ‌డుతున్నాయి. logo